Home Uncategorized మోదీ బయోపిక్‌ను మొత్తం చూడండి

మోదీ బయోపిక్‌ను మొత్తం చూడండి

దిల్లీ: ప్రధాని మోదీ బయోపిక్‌ సినిమాను ఆసాంతం చూసి.. మెరుగైన అవగాహనకు వచ్చిన తర్వాత ఆ చిత్రం విడుదలపై నిషేధానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది. ఈనెల 19లోగా నిర్ణయం తీసుకుని, సీల్డ్‌ కవర్‌లో నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. ఈసీ నివేదికను పరిశీలించి ఈనెల 22న దీనిపై విచారణ చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ దీపక్‌ గుప్త, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.