Home Uncategorized అంగ రంగ వైభవంగా సీత రామ కల్యాణ మహోత్సవం

అంగ రంగ వైభవంగా సీత రామ కల్యాణ మహోత్సవం

దమ్మాయిగూడ: ఎం ఎల్ ఆర్ కాలనీ నందు సీత రామ కల్యాణ మహోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. దమ్మాయిగూడ సర్పంచ్ అనురాధ గారు యాదగిరి గౌడ్ గారు, కార్తిక్ గౌడ్ గారు మరియు టి .ఆర్ . స్ కార్యకర్తలు పాల్గొన్నారు.

అసోసియేషన్ మెంబెర్స్ ప్రెసిడెంట్ PSC. బోస్ గారు, వైస్ ప్రెసిడెంట్స్ RK. మల్లికార్జున, M. విజయ్ కుమార్, బండారు శ్రీధర్, సెక్రటరీ శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ P. కృష్ణ, G. శ్రీనివాస్ , త్రేసరర్ పేంటు ఖాన్ మరియు కమిటీ మెంబెర్స్ K. విశ్వనాధ్, SV. రాఘవరెడ్డి, P. రామకృష్ణ , సోమ చంద్ర రెడ్డి , SV. నాయుడు, D. మాధవ్, S. విక్రాంత్, మునివర్దన్ సాగర్ ,N. నాగరాజు, ప్రవీణ్ గార్ల చేతుల మీదుగా మరియు కాలనీ వాసులంతా కలసి కార్యక్రమం నిర్వహిచారు.

స్వామివారి వివాహ కార్యక్రమాన్ని సుబ్రహ్మణ్యం పురోహితుల వారి మంత్రోచ్చారణలతో , మేళతాళాల మధ్య దేవేరురిరువురు పెండ్లి మండపానికి వూరేగింపుగారగా, సీతమ్మ వారితరుపున సోమా చెంద్రారెడ్డి గారు , రాములవారి తరుపున SV. నాయుడు గారు పీటలమీద కుర్ధుని కన్యాదాన మరియు కల్యాణ , తలంబ్రాల మహోత్సవాన్ని జరిపించారు.

ఈ మహోత్సవానికి కాలనీ వాసులందరు ఆనందోత్సహాలతో పాల్గొని, కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమానికి హాజరుకాగా సీతారాములవారి వైభోగాన్ని ప్రత్యక్కంగా చుసిన అనుభూతి కలిగిందంటూ పలువురు అస్సోసియేషన్ మరియు కమిటీ మెంబెర్స్ ని ప్రశంసించారు.

కార్యక్రమానతరం ప్రెసిడెంట్ బోస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఎంత బాగా జరిపించిన ఆఅసోసియేషన్, కమిటీ మెంబెర్స్ కి ధన్యవాదాలు తెలియ చేసారు.

సేరటరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం స్వామి వారి కల్యాణంలో ఆరు వందల మంది భక్తులు పాల్గొనడం ఈ కాలనీ లో ఇదే మొదటిసారి అని, ఈ పరిణామం మాకు మంచి ఉత్సహాన్ని ఇచ్చిందని, రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా జరిపించేలా కార్యాచరన ఉంటుందని తెలియచేసారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ,అసోసియేషన్ మెంబెర్స్ కు , కమిటీ మెంబెర్స్ కి అందరికి పేరుపేరునా ధన్య వాదాలు తెలియచేసుకుంటున్నాము అన్నారు.

వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున మాట్లాడుతూ ఇవ్వాళ రాత్రి 7. గంటలకి జరగబోయే దేవేరుల ఊరేగింపు కార్యాక్రమంలో ఈదేవిదంగా పెద్ద ఎత్తున పాల్గొని , ఆ కార్యక్రమాన్నీ కూడా జయప్రదం చేయాలనీ భక్తులను కోరామని, అదేవిదంగా భక్తులు కార్యక్రమాన్ని హాజరు అయి జయప్రదం చేసారని హర్షం వ్యక్తం చేసారు .