Home జాతీయం ఐదేళ్లలో అంతర్జాతీయ శక్తిగా అవతరించాం: అమిత్‌షా

ఐదేళ్లలో అంతర్జాతీయ శక్తిగా అవతరించాం: అమిత్‌షా

దిల్లీ: మోదీ నేతృత్వంలో ఈ ఐదేళ్లలో అంతర్జాతీయ శక్తిగా భారత్‌ అవతరించిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి.. అద్భుతమైన పాలన అందించామని చెప్పారు. భాజపా మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం అభివృద్ధిలో దూసుకెళుతోందన్నారు. రూ.12 లక్షల కోట్ల స్కామ్‌లను వెలుగులోకి తెచ్చామని చెప్పారు. సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నామని, అసాధ్యాలను సుసాధ్యం చేశామని వివరించారు. కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. సర్జికల్‌ స్ట్రైక్‌ ద్వారా ఉగ్రమూలలాలను ఏరివేశామని వివరించారు. ఏడు కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని, 12 కోట్ల మంది రైతులకు సాగులో సాంకేతికతను అందించామని తెలిపారు. 2022 నాటికి 75 లక్ష్యాలను పెట్టుకున్నామని చెప్పారు. దార్శనికతతో కూడిన ప్రణాళికను తీసుకుని వస్తున్నామని అమిత్‌ షా వివరించారు.