Home Uncategorized ‘నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనేవారు’

‘నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనేవారు’

నల్లగా ఉన్నానని ఎగతాళి చేశారు: సోనమ్‌ కపూర్‌

ముంబయి: ‘నల్లగా, పొడుగ్గా ఉన్నానని ఒకప్పుడు చాలా మంది ఎగతాళి చేసేవారు’ అంటూ గతంలో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి ఓ కార్యక్రమంలో పంచుకున్నారు బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘పించ్‌’ అనే కార్యక్రమంలో సోనమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్‌ అనుభవాల గురించి మాట్లాడారు. ‘ఒకప్పుడు నేను పొడుగ్గా, సన్నగా, నల్లగా ఉన్నానని చాలా మంది ఎగతాళి చేసేవారు. ఇలాగైతే ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ వేలెత్తి చూపేవారు. అలాగని వారి పట్ల కోపంగా లేను. నన్ను ద్వేషించేవారిని నా శ్రేయోభిలాషులుగా భావించాను. అందుకే వారి మాటలను ఛాలెంజ్‌గా తీసుకుని నేనేంటో నిరూపించుకున్నాను. ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాను. ప్రేమించిన వ్యక్తినే (భర్త ఆనంద్‌ అహూజాను ఉద్దేశిస్తూ) సొంతం చేసుకోగలిగాను. ఇంతకంటే నేను నిరూపించుకోగలిగేది ఇంకేముంటుంది?’ అని వెల్లడించారు సోనమ్‌.
ప్రస్తుతం సోనమ్‌.. ‘జోయా ఫ్యాక్టర్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 2010 వరల్డ్‌ కప్‌ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండబోతోంది. జూన్‌ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.