Home బ్రేకింగ్ న్యూస్ ఎన్నికల తాయిలాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

ఎన్నికల తాయిలాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

దిల్లీ: గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇష్టారీతిన ప్రజలకు హామీలు ఇస్తుంటాయి. వీటిలో భాగంగా ప్రజలకు నగదు పథకాలు, రుణమాఫీలాంటివి ప్రకటిస్తుంటారు. ఇలాంటి భారీ హామీ పథకాలపై పలువురు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు కూడా. తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది.

ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటించే హామీలపై పార్టీలకు సూచనలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల సందర్భంగా  ప్రజలకు రుణమాఫీ, నగదు పథకాలు వంటివి ప్రకటించకుండా పార్టీలకు సూచనలు ఇవ్వాలని కోరుతూ రీనా సింగ్‌ అనే న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. నగదు పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేయాలని ఆమె పిటిషన్‌లో కోరారు.