Home ఆంధ్ర ప్రదేశ్ వైకాపాకు ప్రతిపక్ష హోదా కష్టమే: దేవినేని

వైకాపాకు ప్రతిపక్ష హోదా కష్టమే: దేవినేని

అమరావతి: జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఎన్నికల ఫలితాలు చూసి తట్టుకునేందుకు జగన్‌ సిద్ధంగా లేరని, ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిషోర్ జగన్ చేతిలో సీఎం అనే నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లాడని విమర్శించారు. 11వ తేదీ సాయంత్రమే జగన్ తన ఓటమిని అంగీకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ వరకు క్యాడర్‌ని కాపాడుకునేందుకు జగన్ అనేక తంటాలు పడుతున్నారని ఉమా అన్నారు. స్పీకర్‌పై దాడి చేసింది కాక గవర్నర్‌కు అన్నీ అబద్ధాలే చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కాలు చించుకునే సంస్కృతి జగన్‌దేనని విమర్శించారు. చీఫ్ సెక్రటరీ, ఐపీఎస్ అధికారుల్ని ఇష్టానుసారంగా మారిస్తే విశ్రాంత అధికారులు ఏమైపోయారని ప్రశ్నించారు. హైదరాబాద్ భూభాగంలో దొంగలు దొంగలు కలిసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని దుయ్యబట్టారు.

ఓటు వేసిన మరుక్షణం పక్క రాష్ట్రానికి పారిపోయిన జగన్.. తాము త్వరగా పోవాలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ఎక్కడికీ వెళ్లేది లేదని, మళ్లీ పాలించేది తెలుగుదేశమేనని ధీమా వ్యక్తంచేశారు. చంచల్ గూడ జైలుకా?లేక చర్లపల్లి జైలుకా?అనేది తేల్చుకోవాల్సింది జగనేని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితుల్లో వైకాపా ఉందని జోస్యం చెప్పారు.