Home ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషన్‌ది ఓవరాక్షన్‌‌: వీహెచ్‌

ఎన్నికల కమిషన్‌ది ఓవరాక్షన్‌‌: వీహెచ్‌

కాకినాడ కలెక్టరేట్‌: ఎన్నికల కమిషన్‌ ఓవరాక్షన్‌ చేస్తోందని కాంగ్రెస్ సీనియర్‌ నేత వి.హనుమంతురావు అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికల కమిషన్‌ ఏనాడూ ఇంత దారుణంగా వ్యవహరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ను అకారణంగా తొలగించారని, ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిచడం లేదని ఆరోపించారు. ప్రధాని మోదీని వ్యతిరేకించే వారిపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని దారుణంగా తొలగించారని, దీన్ని నిరసిస్తూ శుక్రవారం ఏపీ వ్యాప్తంగా అన్ని అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.