Home జాతీయం ఓటు హక్కు వినియోగించుకున్న తలైవా

ఓటు హక్కు వినియోగించుకున్న తలైవా

దిల్లీ : సార్వత్రిక సమరంలో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. దేశంలోని పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కూడా ఓటేశారు. ఆయన కూమారుడు కార్తీ చిదంబంరం తమిళనాడులోని శివగంగ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరో అజిత్‌, నటుడు అరుణ్‌ విజయ్‌ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో దశలో 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో 38 లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.