Home తెలంగాణ ‘పరిషత్‌’ పోరు.. నేడో, రేపో నోటిఫికేషన్‌!

‘పరిషత్‌’ పోరు.. నేడో, రేపో నోటిఫికేషన్‌!

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయగా.. ఎన్నికల సంఘం సైతం ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసింది. తాజాగా గురువారం అన్ని జిల్లాలకు చెందిన కలెక్టర్లు, పోలీసు, పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎస్‌ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షించనున్నారు. జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు. సంసిద్ధతపై సమాచారం ఆధారంగా నేడో, రేపోఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఈ సారి మూడు విడతల్లో  ఎన్నికలు జరగనున్నాయి.

పరిశీలకులు వీరే..
రాష్ట్రంలో జరగనున్న పరిషత్‌ ఎన్నికల కోసం జిల్లాలకు సాధారణ పరిశీలకులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఆదేశాలిచ్చింది.
• ఆదిలాబాద్‌, నిర్మల్‌: స్వాతి లక్రా
• కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల: మహ్మద్‌ అబ్దుల్‌ నదీమ్‌
• జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట: శరవణన్‌
• కరీంనగర్‌, పెద్దపల్లి: పౌసుమి బసు
• భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం: శశిధర్‌ రెడ్డి
• గద్వాల్‌, వనపర్తి: కె.వై. నాయక్‌
• మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట్‌: శర్మన్‌
• మెదక్‌, సంగారెడ్డి: వాకాటి కరుణ
• నల్గొండ, సూర్యాపేట: చంపాలాల్‌
• యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌: సోనిబాలాదేవి
• కామారెడ్డి, నిజామాబాద్‌: అభిలాశ్‌ బిస్త్‌
• రంగారెడ్డి, వికారాబాద్‌:  శ్రీలక్ష్మి
• భూపాలపల్లి, ములుగు, జనగాం: ఆకునూరి మురళి
• మహబూబాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌: బి. శ్రీనివాస్‌