Home Uncategorized యూపీలో పట్టాలు తప్పిన రైలు

యూపీలో పట్టాలు తప్పిన రైలు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. హావ్‌డా నుంచి దిల్లీ వెళ్తున్న పూర్వా ఎక్స్‌ప్రెస్.. కాన్పూర్ సమీపంలో శనివారం వేకువజామున పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పగా.. అందులో నాలుగు పూర్తిగా బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు, బస్సులు ఉపయోగిస్తున్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక పోలీసు బలగాలు, వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సేవలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.