Home Uncategorized హలో రాధాకృష్ణ మేం మీ అమ్మాయిని కిడ్నాప్‌ చేశాం!

హలో రాధాకృష్ణ మేం మీ అమ్మాయిని కిడ్నాప్‌ చేశాం!

ఆసక్తికరంగా ‘బ్రోచేవారెవరురా’ టీజర్‌!

హైదరాబాద్‌: శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, సత్యదేవ్‌,  కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. చలనమే చిత్రము.. చిత్రమే చలనము అనేది ఉప శీర్షిక. నివేదా థామస్‌, నివేదా పేతురాజు కథానాయికలు. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. శనివారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. 

‘ఆర్‌3’ రాఖీ, రాంబో, రాహుల్‌ అంటూ  శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి పాత్రలతో పరిచయమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. జీవితంలో లక్ష్యాలంటూ లేని ముగ్గురు యువకులు డబ్బు సంపాదన కోసం ఏం చేశారన్న కథతో ఈ సినిమాను వివేక్‌ ఆత్రేయ తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మన్యం ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కుమార్‌ మన్యం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘బ్రోచేవారెవరురా’ చిత్రాన్ని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.