Home బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని శాస్త్రిపురంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐసిస్‌ ఉగ్రవాది అబ్దుల్‌ బాసిత్‌ అనుచరులు ఇక్కడ ఉన్నారనే అనుమానంతో ఈ సోదాలు చేపట్టారు. పలువురి ఇళ్లలో శనివారం ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 

2018 ఫిబ్రవరిలో ఉగ్రవాది అబ్దుల్‌ బాసిత్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. అబుదాబిలో ఐసిస్‌ మాడ్యూల్‌ కేసులో అతడిపై ఛార్జిషీటు నమోదైంది. మరికొందరికి ఐసిస్‌తో సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల సహకారంతో ఏడెనిమిది ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి.