Home Uncategorized ధ్యానంతో మానసిక ఒత్తిడి దూరం

ధ్యానంతో మానసిక ఒత్తిడి దూరం

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : గర్భిణుల్లో కలిగే మానసిక ఒత్తిడిని ధ్యానంతో జయించవచ్చని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం చేగూర్‌ కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసిన ఆశా, అంగన్‌వాడీల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆశాలు, అంగన్‌వాడీలు మెరుగైన సేవలు అందించడంవల్లే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటున్నారని అన్నారు. గర్భిణులకు పోషకాహారం, మందులతోపాటు ధ్యానం కూడా ముఖ్యమనే విషయం తెలియజేయాలని కోరారు.  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.రజిని, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ జిల్లా అధికారి శంకరాచారి, వైద్య, ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్‌ అధికారి డా.కృష్ణ, డీపీహెచ్‌ఎన్‌వో లత పాల్గొన్నారు.