Home ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంట రైల్వేస్టేషన్‌లో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం

రేణిగుంట రైల్వేస్టేషన్‌లో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం

చిత్తూరు: చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వరరావుపైనా నిందితులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీసీ సహా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నిందితులను తమిళనాడుకు చెందిన వెంకటేశ్‌, విజయన్‌గా గుర్తించారు. వారిని రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి గత నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు. వీరిలో ఒకరి మానసిక పరిస్థితి సరిగాలేదని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.