Home అంతర్జాతీయం శ్రీలంక పేలుళ్లలో 166 కి చేరిన మృతుల సంఖ్య

శ్రీలంక పేలుళ్లలో 166 కి చేరిన మృతుల సంఖ్య

కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 166 మంది మృతిచెందినట్లు సమచారం. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈస్టర్‌ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.45 ప్రాంతంలో కొలంబోలోని ఒక చర్చితోపాటు మూడు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బాంబులు పేలాయి. కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరి హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. శ్రీలంకలోని భారత అధికారులతో మాట్లాడామన్నారు.