Home Uncategorized అతడో సైకో

అతడో సైకో

బాలికలను కొట్టి అపస్మారక స్థితిలో ఉండగానే అత్యాచారం.. హత్య
మహిళను వేధించినందుకు గతంలో దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
ఆ ఉన్మాదంతోనే ఘాతుకాలు
హాజీపూర్‌ హంతకుడు శ్రీనివాస్‌రెడ్డిని పట్టుకున్న రాచకొండ పోలీసులు

అమాయకులైన బాలికలకు మాయమాటలు చెప్పాడు. బైక్‌పై ఊర్లో దింపుతానని మభ్యపెట్టాడు.. తన కోరిక తీర్చడానికి వారు అంగీకరించలేదని మానవమృగంలా మారాడు. లైంగిక వాంఛ తీర్చుకున్నాక అమ్మాయిలను చంపేశాడు. జనారణ్యంలో తప్పించుకు తిరుగుతున్న హాజీపూర్‌ మానవమృగం పోలీసులకు చిక్కాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో జరిగిన ఈ ఘటనలకు కారకుడైన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అలియాస్‌ హనుమంతు(28)ను మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అదనపు డీసీపీలు సురేందర్‌రెడ్డి(ఎస్‌వోటీ), సలీమా(షీ బృందాలు), ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, రవికుమార్‌తో కలిసి నిందితుడి అకృత్యాలను వివరించారు. హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి ఏప్రిల్‌ 25న కీసరలోని సెరినిటీ మోడల్‌ స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు దర్యాప్తు క్రమంలో శ్రీనివాస్‌రెడ్డికి చెందిన పొలంలో పాడుబడిన బావి వద్ద పుస్తకాల సంచి లభించింది. మరుసటిరోజు అదే బావిలో మట్టితో కప్పెట్టిన స్థితిలో శ్రావణి మృతదేహం లభ్యమైంది. ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానించారు. వైద్యుల ప్రాథమిక నివేదికలో ఇదే విషయం వెల్లడైంది. దర్యాప్తు కొనసాగుతుండగానే అదే బావిలో మరో బాలిక అస్థిపంజరం దొరకడం కలకలం రేపింది. ఈబావిలో లభ్యమైన మరో పుస్తకాల సంచిలోని ధ్రువపత్రాలను బట్టి అదే గ్రామానికి చెందిన మనీషాగా తేలింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం అదృశ్యమై మిస్టరీగానే మిగిలిన బాలిక కల్పన వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇలా ఒకే గ్రామంలో వరుస ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన పాత నేరస్థుడు శ్రీనివాస్‌రెడ్డి కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. కర్నూలు జిల్లాలో ఓ వ్యభిచారిణి హత్యకేసులో ఇతను నిందితుడు కావడంతో ప్రత్యేక బృందాలు గాలింపులు చేపట్టాయి. ఈక్రమంలో రావిర్యాల గ్రామంలో బంధువుల ఇంట్లో తలదాచుకున్న శ్రీనివాస్‌రెడ్డి చిక్కడంతో హత్యల పరంపర వెలుగుచూసింది.

బతికుండగానే బావిలోకి నెట్టేశాడు
ఈనెల 25న కీసర నుంచి హాజీపూర్‌ వచ్చే క్రమంలో శ్రావణి బొమ్మల రామారానికి చేరుకుంది. అక్కడి నుంచి స్వగ్రామానికి కాలినడకనే వెళ్లాల్సి రావడంతో లిఫ్టు కోసం ఓ చింతచెట్టు కింద ఆగింది. బొమ్మల రామారం నుంచి ఊరికి ఒంటరిగా ఎవరెవరు రాకపోకలు సాగిస్తున్నారో తెలుసుకునేందుకు శ్రీనివాస్‌రెడ్డి పలుమార్లు రెక్కీ నిర్వహించి శ్రావణిపై కన్నేశాడు. ఆమె చింతచెట్టు కింద ఒంటరిగా ఉండటంతో ఊరిలోకి తీసుకెళ్తానని తన బైక్‌పై లిఫ్టు ఇచ్చాడు. మార్గమధ్యంలో తన పొలం వద్దకు రాగానే బైక్‌ను ఆపి తన కోరిక బయటపెట్టాడు. శ్రావణి నిరాకరించడంతో గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి బావిలోకి నెట్టేశాడు. అనంతరం బావిలోకి దిగి అపస్మారక స్థితిలో పడిఉన్న శ్రావణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను చంపి మట్టితో కప్పెట్టాడు. అనంతరం శ్రావణి పుస్తకాల సంచిని పక్కనే ఉన్న సీతారాంరెడ్డికి చెందిన బావిలో పడేసి వెళ్లిపోయాడు.

దేహశుద్ధి చేసినందుకే సైకోలా మారాడా?
మైసిరెడ్డిపల్లికి చెందిన ఓ వివాహిత(38) 2015 సెప్టెంబరు 28న పశువులు కాస్తుండగా శ్రీనివాస్‌రెడ్డి వేధింపులకు పాల్పడ్డాడు.దీంతోగ్రామస్థులు శ్రీనివాస్‌రెడ్డికి  దేహశుద్ధి చేశారు. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. తర్వాత ఇరువర్గాల వారు రాజీ పడ్డారు. అయితే గ్రామస్థులు కొట్టడం వల్లే నిందితుడు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. మద్యం అలవాటున్న శ్రీనివాస్‌రెడ్డి నీలిచిత్రాలు చూస్తూ లైంగిక వాంఛతో రగిలిపోయే వాడని..ఈక్రమంలో సైకోగా మారిపోయి మైనర్లను లక్ష్యంగా చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

కర్నూలులో వ్యభిచారిణిని చంపి..
లిఫ్టు మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్‌రెడ్డి 2016లో పనిపై కర్నూలు వెళ్లాడు. తనతోపాటు పనిచేసిన మరో నలుగురితో కలిసి ఓ వ్యభిచారిణిని గదికి రప్పించుకున్నారు. డబ్బుల విషయంలో గొడవ జరగడంతో ఆమెను చంపేసి నీళ్ల ట్యాంకులో పడేసి పారిపోయారు. ఆ కేసులో నిందితులు ఐదుగురిని కర్నూలు రెండో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పట్లో కల్పనను హత్య చేసిన విషయం బహిర్గతం కాకపోవడంతో శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాల పరంపర కొనసాగింది.

అదృశ్యమైన రోజే మనీషా అంతం
హాజీపూర్‌కే చెందిన మనీషా(17) కీసర మండలం చేర్యాలలో బీకాం రెండో సంవత్సరం చదివేది. మార్చి 9న ఊరి నుంచి కళాశాలకు వెళ్తుండగా శ్రీనివాస్‌రెడ్డి లిఫ్టు ఇస్తానని బైక్‌పై ఎక్కించుకున్నాడు. వ్యవసాయ బావి వద్దకు రాగానే బైక్‌ ఆపి కోరిక బయటపెట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి అపస్మారక స్థితిలోకి నెట్టి అత్యాచారం చేశాడు. అనంతరం  చంపేసి సొంత బావిలోనే మృతదేహాన్ని పడేసి మట్టితో కప్పాడు.


నాలుగేళ్ల క్రితం కల్పనను అంతమొందించాడి