Home ఆంధ్ర ప్రదేశ్ మైనర్లకు పోలీసుల కౌన్సెలింగ్‌

మైనర్లకు పోలీసుల కౌన్సెలింగ్‌

అరసవల్లి: నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన మైనర్‌ బాలురకు శనివారం శ్రీకాకుళం డీఎస్పీ చక్రవర్తి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రెండు రోజుల క్రితం గార మండలం చల్లవానిపేట గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో పోలీసులు మైనర్ల బైక్‌ రేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా పోలీసులు పలు వీధుల నుంచి మైనర్ బాలుర్లను ఒకటో నంబరు పోలీసు స్టేషనుకు తీసుకొచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇకపై రాత్రి 9 గంటల సమయానికల్లా ఇంటికి చేరుకోకపోతే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్రవాహనాలు వారికి ఇచ్చేవారిపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.