Home జాతీయం వెల్దుర్తి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

వెల్దుర్తి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

దిల్లీ: కర్నూలు జిల్లా వెల్దుర్తి చెక్‌పోస్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో మృతులకు ఆయన సంతాపం తెలిపారు. ఈ ఘటనను దురదృష్టకరమంటూ ట్విటర్‌లో పేర్కొన్న మోదీ.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కర్నూలు జిల్లా వెల్దుర్తి చెక్‌ పోస్టు వద్ద ఎస్‌ఆర్‌ఎస్‌కు చెందిన ట్రావెల్స్‌ బస్సు తుఫాన్‌ వాహనాన్ని అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో తెలంగాణలోని గద్వాల జిల్లాలోని రామాపురం గ్రామాని చెందిన 15 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.