Home ఆంధ్ర ప్రదేశ్ కలిసి నడుద్దాం.. ప్రగతి సాధిద్దాం: కేసీఆర్‌

కలిసి నడుద్దాం.. ప్రగతి సాధిద్దాం: కేసీఆర్‌

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభావేదికపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. 
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌  మాట్లాడుతూ… ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు. వయసు చిన్నది కానీ, బాధ్యత పెద్దది. బాధ్యతలను అద్భుతంగా నిర్వహించగలిగిన శక్తి, సామర్థ్యం ఉందని గత తొమ్మిదేళ్లలో నిరూపించారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ పాలనలో ప్రజలు  సుఖ సంతోషాలతో ఉండాలి. రెండు రాష్ట్రాల ప్రజలు ఆత్మీయతతో పరసర్పరం సహకరించుకుంటూ అభివృద్ధి చెందాలి. గోదావరి జలాల వినియోగం వందశాతం జరగాలి. కృష్ణానది నీటి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. కర్తవ్య నిర్వహణలో సహాయ సహకారాలు, అండదండలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. జగన్‌కు అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. చాలా సంతోషం. మీ నాన్నగారి పేరును నిలబెట్టాలి. మూడు.. నాలుగు టర్మ్‌ల వరకూ మీ పరిపాలన సాగాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని అన్నారు.