Home ఆంధ్ర ప్రదేశ్ జగన్‌కు చంద్రబాబు అభినందనలు

జగన్‌కు చంద్రబాబు అభినందనలు

అమరావతి: కాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న వైకాపా అధినేత జగన్‌కు తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ‘‘నూతన సీఎంగా  ప్రమాణం చేస్తున్న సందర్భంగా అభినందనలు. తెలుగుదేశం పార్టీ తరఫున మీకు శుభాకాంక్షలు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలి. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారం అందిస్తాం’’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.