Home పాలిటిక్స్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన మమతా బెనర్జీ

జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన మమతా బెనర్జీ

విజయవాడ: మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ  ఫోన్‌ చేసి జగన్‌కు అభినందనలు తెలిపారు. మరో వైపు ఇవాళ ఉదయం తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి చేరుకున్న సినీనటుడు మంచు విష్ణు .. జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఇవాళ ఉదయం 12.23గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.