Home ఆంధ్ర ప్రదేశ్ భారీగా తరలివచ్చిన జగన్‌ అభిమానులు

భారీగా తరలివచ్చిన జగన్‌ అభిమానులు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి కాసేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు జగన్‌ అభిమానులు, వైకాపా శ్రేణులు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానానికి భారీగా తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి వైకాపా నేతలు తరలిరావడంతో నగరంలో రద్దీ నెలకొంది. దీంతో బందర్‌రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.
 బెంజిసర్కిల్‌ నుంచి  పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకూ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మిగతావారిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలిస్తున్నారు. జగన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 14 చోట్ల ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీఐపీల రాక నేపథ్యంలో విజయవాడను హై సెక్యురిటీ జోన్‌గా ప్రకటించారు.