Home జాతీయం మంత్రివర్గంలో మేము చేరడం లేదు..

మంత్రివర్గంలో మేము చేరడం లేదు..

మంత్రి పదవులపై జేడీయూ అసంతృప్తి

దిల్లీ: కేంద్రంలో కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వంలో తాము చేరట్లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. ‘భాజపా ఇచ్చిన ఆఫర్ మాకు అంగీకారయోగ్యం కాదు. మేం కూటమితోనే కొనసాగుతాం కానీ ప్రభుత్వంలో చేరం’ అని నితీశ్ స్పష్టం చేశారు. దీనంతటికి కారణం కొత్త ప్రభుత్వంలో జేడీయూకు ఒక్క బెర్త్‌ కేటాయించడమే.  షాతో సమావేశమైన నితీశ్ కొత్త ప్రభుత్వంలో రెండు బెర్తులు కోరినట్లు తెలుస్తోంది. అయితే నితీశ్ సన్నిహితుడు ఆర్‌సీపీ సింగ్‌కు మాత్రమే అమిత్ షా నుంచి ఫోన్‌ కాల్ వచ్చింది. దీనిపై అసంతృప్తితో ఉన్న జేడీయూ దిల్లీలో నిర్వహించిన సమావేశంలో మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరుకావద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  మిత్రపక్షాలకు మంత్రి పదవులు ఇచ్చే విషయంపై శివసేన నేత సంజయ్‌ రౌత్ మాట్లాడుతూ..భాజపా తన మిత్రపక్షాలన్నింటికి ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు.