Home జాతీయం మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులు..

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులు..

దిల్లీ: నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్‌ ముందున్న బహిరంగ ప్రదేశంలో మరి కాసేపట్లో మోదీ రెండోసారి ప్రధానిగా  ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే దేశ విదేశీ ప్రముఖులతో పాటు పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులంతా అక్కడికి చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ, యూపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు కుమారస్వామి, దేవేంద్ర ఫడణవీస్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, యోగి ఆదిత్యనాథ్‌, పళనిస్వామి, ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ దంపతులతో పాటు పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్‌ అంబానీ దంపతులు, రతన్‌టాటా హాజరయ్యారు.