Home ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ చేరుకున్న స్టాలిన్‌

విజయవాడ చేరుకున్న స్టాలిన్‌

విజయవాడ: వైకాపా అధినేత జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు డీఎంకే అధినేత స్టాలిన్‌ విజయవాడ చేరుకున్నారు. చెన్నై నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న స్టాలిన్‌కు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డీఎంకే అభిమానులు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో స్టాలిన్‌ విజయవాడలోని స్టేట్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12గంటలకు  స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి ఆయన ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకోనున్నారు.