Home Uncategorized అమెరికా అధ్యక్ష పదవికి మళ్లీ ట్రంప్‌ పోటీ

అమెరికా అధ్యక్ష పదవికి మళ్లీ ట్రంప్‌ పోటీ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లిక్‌ పార్టీ తరఫున రెండో సారి పోటీ చేయాలని డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారు. ఈ నెల 18న ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒర్లాండోలో జరిగే సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయంలో ఫ్లోరిడా రాష్ట్రం కీలక పాత్రను పోషించడం గమనార్హం. అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన 2020లోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తన మద్దతుదార్లతో మాట్లాడేటప్పుడు మిగిలిన 18 నెలల పదవీ కాలం అని కాకుండా, మిగిలిన అయిదున్నరేళ్ల కాలం అని అంటుంటారు. అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు కాగా, రెండు సార్లు మాత్రమే ఆ పదవిని చేపట్టడానికి వీలుంది. తదుపరి అధ్యక్ష ఎన్నికలు 2020 నవంబరు 3న జరగనున్నాయి.