Home Uncategorized జూలై 7న ఎమ్మార్పీఎస్‌ సిల్వర్‌ జూబ్లీ

జూలై 7న ఎమ్మార్పీఎస్‌ సిల్వర్‌ జూబ్లీ

విజయవాడ: మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) ఏర్పడి జూలై 7వ తేదీ నాటికి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆవిర్భావం జరిగిన ప్రకాశం జిల్లా ఈరుమూడి గ్రామంలోపెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ఐదేళ్ల పాలనలో మాదిగలకు నమ్మకద్రోహం చేయడమే కాకుండా తమ హక్కులు, ఉనికిని దెబ్బతీసి అణిచి వేయాలని కుట్రలు పన్నారని, దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసినట్టుగానే గిరిజనులకు, మైదాన ప్రాంతాల్లో ఉన్న తెగలవారికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.