Home Uncategorized బీజేపీలోకి భారీగా చేరికలు.

బీజేపీలోకి భారీగా చేరికలు.

  • కండువాలు కప్పి ఆహ్వానించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా
  • త్వరలో పెద్దఎత్తున చేరికలుంటాయని వ్యాఖ్

గుంటూరు(సంగడిగుంట), జూన్‌ 3:టీడీపీ, జనసేన నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు సోమవారం బీజేపీలో చేరారు. వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో దేశప్రజలు మోదీ అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. 2014 లో రాష్ట్ర విభజన ఆగదని తెలిసి ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పుడు హోదా విషయంలో కూడా అదే జరుగుతోందన్నారు. భవిష్యత్తులో వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. బీజేపీలో చేరిన వారిలో ఏపీ ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గుడిసె దేవానంద్‌, ఎస్సీ,ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వేముల మోజెస్‌తోపాటు గురజాల, మాచర్ల నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 300 కుటుంబాలు పార్టీలో చేరాయి. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణంతోపాటు విజయబాబు, శివనాగేంద్రం, నల్లబోతు వెంకట్రావు, సైదారావు, అమర్నాధ్‌ తదితరులు పాల్గొన్నారు.