Home Uncategorized సిపెట్‌ జేఈఈ దరఖాస్తులకు 30 వరకు గడువు

సిపెట్‌ జేఈఈ దరఖాస్తులకు 30 వరకు గడువు

విజయవాడ: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సిపెట్‌)లో 2019 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం సీట్లను పెంచింది. విజయవాడలోని సిపెట్‌లో అమలవుతున్న మూడు కోర్సుల్లోనూ సీట్లను రెట్టింపు చేశారు. పీజీడీ-పీపీటీ(పోస్టుగ్యాడ్యుయేట్‌ డిప్లమో ఇన్‌ ప్లాస్టిక్‌ ప్రోసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌), డీపీఎంటీ(డిప్లమో ఇన్‌ ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ), డీపీటీ(డిప్లమో ఇన్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ)లలో 60 చొప్పున సీట్లు ఉండేవి. తాజా పెంపుతో ఒక్కో ట్రేడ్‌లో 120 సీట్లు ఈ ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ కోర్సుల్లో చేరడానికి అభ్యర్థులు ఈనెలఖారులోపు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ పరీక్షను జూలై 7న నిర్వహిస్తారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు, అనంతపురం కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉటుంది. ఇతర వివరాలకు 99593 33415, 89770 33373 నంబర్లలో సంప్రదించాలని సిపెట్‌ విజయవాడ డైరెక్టర్‌ వి.కిరణ్‌కుమార్‌, ఏడీ రమేశ్‌బాబు సూచించారు.