Home Uncategorized కాళ్లు, చేతులు కట్టేసి కర్రలతో చితక్కొట్టారు

కాళ్లు, చేతులు కట్టేసి కర్రలతో చితక్కొట్టారు

జైపుర్‌: రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత యువకుడి కాళ్లు, చేతులు కట్టేసిన కొందరు వ్యక్తులు అతడిని దారుణంగా కర్రలతో చితక్కొట్టారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఒకరు కాషాయ దుస్తులు ధరించి ఉన్నాడు. బాధిత దళిత యువకుడు ఓ గుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడని, అందుకే అతడిని దారుణంగా కొట్టారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు, ఆ యువకుడు ఓ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నందుకే వారు కొట్టారని వాదనలు వినపడుతున్నాయి. ‘ఆ దళిత యువకుడు ఓ చిన్నారిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసులు మీడియాకు తెలిపారు.

ఆ యువకుడిని కొందరు కట్టేసి కొడుతుండగా తీసిన వీడియో తమ దృష్టికి రాగానే ఆ నిందితులను కూడా అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. కొందరు వ్యక్తులు తన కాళ్లు, చేతులు కట్టేసి కర్రలతో కొడుతుండగా.. తనను వదిలేయాలని ఆ యువకుడు వేడుకుంటూ రోదిస్తున్నట్లు ఈ వీడియోలో కనపడుతోంది. పాలి జిల్లాలోని ధనేరియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ వీడియో తీసినట్లు సమాచారం. ఈ కేసులో పోలీసులు తదుపరి విచారణను కొనసాగిస్తున్నారు.