Home తెలంగాణ అభివృద్ధి పనుల జాప్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం

అభివృద్ధి పనుల జాప్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం

ఖమ్మం కార్పొరేషన్‌: నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల జాప్యంపై ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణం, నర్సింహస్వామి గుట్ట రహదారి విస్తరణ పనులు నత్తనడకన ఎందుకు సాగుతున్నాయని ప్రశ్నించారు. ఏడాది క్రితం పనులు దక్కించుకొని కనీసం 50శాతం పనులు పూర్తి చేయకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆర్టీసీ సీఈని కోరారు. గుట్ట పనులు అసంపూర్తిగా ఉండటంపై పంచాయితీరాజ్‌ ఈఈ ప్రభాకర్‌, డీఈ రామాంజనేయ స్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రణాళిక ప్రకారం పనులు చేయకుండా మండప నిర్మాణం ఎందుకు మార్చారని వారిని ప్రశ్నించారు. ప్రధాన అర్చకుల సూచన మేరకు దానిని మార్చినట్లు వారు వెల్లడించారు. ఆయన వెంట ఈవో జగన్మోహనరావు, స్థానిక కార్పొరేటర్లు శీలంశెట్టి రమ, ఇందిర తదితరులు ఉన్నారు. దీనికి ముందు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ వెంకటరమణతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.