Home ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ‘ఎమ్మెల్సీ’ షెడ్యూల్‌ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ‘ఎమ్మెల్సీ’ షెడ్యూల్‌ విడుదల

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్ర స్వామి.. తెలంగాణలో యాదవ రెడ్డి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునేందుకు వీలుగా ఉప ఎన్నిక షెడ్యూల్‌ జారీ చేసింది. గతంలో తెదేపా నుంచి కరణం బలరాం, వైకాపా నుంచి ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్సీలుగా ఉండేవారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వీరంతా ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణలో తెరాస ఎమ్మెల్సీగా ఉన్న యాదవరెడ్డి పార్టీ ఫిరాయించారనే అంశంలో అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈనెల 7న దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.