Home Uncategorized ‘మాపై అనర్హత వేటు.. రాజ్యాంగ విరుద్ధం’

‘మాపై అనర్హత వేటు.. రాజ్యాంగ విరుద్ధం’

వీరితో కలిపి 12 చేరిన సంఖ్య

దిల్లీ: అనర్హత వేటు పడిన మరో తొమ్మిది మంది కర్ణాటక ఎమ్మెల్యేలు గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర మాజీ స్పీకర్‌ రమేశ్ కుమార్ రాజీనామాలు తిరస్కరించి, అనర్హత వేటు వేయడంపై వారు కోర్టులో సవాలు చేశారు. మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా పిటిషన్ వేసిన వారిలో ముగ్గురు జేడీఎస్‌, ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో కలిపి సుప్రీంను ఆశ్రయించిన అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరింది. 

ఈ నెల ఆరంభంలో కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి స్పీకర్‌ రమేశ్ కుమార్ ఎన్నిసార్లు ఆదేశించినప్పటికీ రాజీనామాలు వెనక్కి తీసుకోకపోవడంపై 14 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటు వేశారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. 2023 వరకు తమపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ కాంగ్రెస్‌కు చెందిన రమేశ్‌ జార్కిహోళి, మహేశ్‌ కుమటళ్లి, స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌ శంకర్‌ కొద్ది రోజుల క్రితం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ సుప్రీంలో పెండింగ్ దశలో ఉంది. 