Home ఆంధ్ర ప్రదేశ్ విద్యా సంస్థలను సేవా దృక్పథంతో నడపాలి

విద్యా సంస్థలను సేవా దృక్పథంతో నడపాలి

ఒంగోలు గ్రామీణం (ప్రకాశం): ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యాసంస్థలను వ్యాపారంగా కాకుండా సేవా దృక్పథంతో నడిపించాలని జిల్లా కలెక్టర్‌ పి.భాస్కర్‌ అన్నారు. ఒంగోలులోని పాత జడ్పీ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్‌లతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన విద్యాహక్కు చట్టం కచ్చితంగా అమలుపరుస్తూ తమవంతు తోడ్పాటు అందించాలని సూచించారు. యాజమాన్యాలు అందరికీ విద్యనందించే దిశగా పయనించాలన్నారు. విద్యాసంస్థల స్థాపన సమయంలో తొలుత ప్రభుత్వ నిబంధనల మేరకు గుర్తింపు పొంది ఆ తర్వాత నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని గుర్తుచేశారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, ఎస్‌ఎస్‌ఎ పీవో వెంకటేశ్వరరావ్‌ పాల్గొన్నారు.