Home Uncategorized కర్తవ్యమే మిన్నగా..!

కర్తవ్యమే మిన్నగా..!

కర్ణాటక: ఎంతో ప్రేమగా చూసుకునే తాతయ్య చనిపోయినా వెళ్లకుండా.. వృత్తి పట్ల అంకితభావంతో వరద బాధితులకు సాయం అందించడంలోనే నిమగ్నమైన విజయపుర జిల్లా కలెక్టర్‌ వైఎస్‌ పాటిల్‌ అందరి మన్ననలు పొందారు. చిన్ననాటి నుంచి ప్రేమను చూపి లాలించిన తాతయ్య అంత్యక్రియలా? వరద బాధితుల సహాయమా? అన్న ప్రశ్న ఉత్పన్నమయితే నిరాశ్రయులకు అండగా నిలవడానికే ఆయన మొగ్గు చూపారు. వరదముంపులో చిక్కుకుపోయిన వారికి సాయం అందించే పనుల్లో నిమగ్నమయ్యారు.