Home Uncategorized తెలుగు విద్యార్థికి అమెరికాలో ఏడాది జైలు

తెలుగు విద్యార్థికి అమెరికాలో ఏడాది జైలు

వాషింగ్టన్‌: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థికి అమెరికా న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41.5లక్షల (58,471 డాలర్లు) భారీ జరిమానా విధించింది. చిత్తూరుకు చెందిన ఆకుతోట విశ్వనాథ్‌(27) అల్బనీలోని సెయింట్‌ రోజ్‌ కళాశాలలో 66 కంప్యూటర్ల పరికరాలను ధ్వంసం చేశాడని కళాశాల యాజమాన్యం ఫిర్యాదు చేయగా విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఉత్తర కరోలినా ఫెడరల్‌ కోర్టు విశ్వనాథ్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.