Home Uncategorized భారత ప్రజలకు అమెరికా శుభాకాంక్షలు

భారత ప్రజలకు అమెరికా శుభాకాంక్షలు

వాషింగ్టన్‌: భారత్‌ స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని 73 వసంతాలు గడిచిన వేళ అగ్రరాజ్యం అమెరికా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో గురువారం మాట్లాడుతూ..‘‘స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న భారత ప్రజలకు అమెరికా ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి భారత్‌-అమెరికా మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అనంతరం ఇరు దేశాల మధ్య సాగిన ఆర్థిక, వాణిజ్యపరమైన ఒప్పందాలు బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. గత రెండు దశాబ్దాల్లో ఉభయ దేశాల బంధం రక్షణ, అంతరిక్షం, శాస్త్ర సాంకేతిక, ఉగ్రవాద నిరోధక రంగాల వంటి కీలక అంశాలకు విస్తరించింది’’ అని ఇరు దేశాల మధ్య బంధాన్ని గుర్తు చేశారు.