Home Uncategorized రస్‌ అల్‌ ఖైమా కేసులో సాక్ష్యానికి లండన్‌ కోర్టుకు ముగ్గురు అధికారులు

రస్‌ అల్‌ ఖైమా కేసులో సాక్ష్యానికి లండన్‌ కోర్టుకు ముగ్గురు అధికారులు

ఈనాడు, అమరావతి: బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించి రస్‌అల్‌ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, భారత దేశానికి మధ్య కొనసాగుతున్న కేసులో లండన్‌ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులను నియమించింది. ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ఇంటిలిజెన్స్‌ డీఐజీ సీహెచ్‌ శ్రీకాంత్‌, రహదారులు భవనాల శాఖ సీఈ జి.వెంకటేశ్వరరావును నియమిస్తూ గనుల శాఖ ప్రభుత్వ కార్యదర్శి కె.రామ్‌గోపాల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.