Home Uncategorized రోగి పొట్టలో 452 లోహపు వస్తువులు

రోగి పొట్టలో 452 లోహపు వస్తువులు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అజీర్తి వల్లేనని భావించిన వైద్యులు ఆయనకు సాధారణ చికిత్స చేసి పంపారు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎక్స్‌ రే తీశారు. ఆ నివేదికను చూసి షాకవ్వడం వారి వంతైంది. ఆ వ్యక్తి కడుపులో లోహపు వస్తువులు ఉండడాన్ని గమనించారు. ఆపరేషన్‌ చేసి ఏకంగా నాలుగు కేజీల బరువు గల 452 లోహపు వస్తువులను బయటకు తీశారు. నైల్‌ కట్టర్‌, పిన్నులు, నట్టులు, బోల్టుల, చిన్న చిన్న మేకులు, నాణేలు అందులో ఉన్నాయి. 
అహ్మదాబాద్‌లోని సివిల్‌ ఆసుపత్రిలోని నలుగురు వైద్యులు సుమారు మూడు గంటలపాటు శ్రమించి ఈ శస్త్ర చికిత్స చేశారు. గత ఏడెనిమిది నెలలుగా ఇవే తిని ఉండవచ్చని వైద్యులు తెలిపారు. స్క్రిజోఫీనియా అనే వ్యాధి కారణంగా ఇవి కూడా ఆహార పదార్థాలేనని భావించి తిని ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని, కొన్ని రోజులు పర్యవేక్షణలో ఉంచాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు.