LATEST ARTICLES

జియో గిగా ఫైబర్ ఛార్జీలు ఎంతంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: జియో గిగా ఫైబర్‌ పేరుతో రిలయన్స్‌ నుంచి బ్రాడ్‌ బ్యాండ్‌, టీవీ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కేవలం 1,100 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినా ఇవి ఇంకా ట్రయల్ దశలోనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో వాణిజ్యపరంగా గిగా ఫైబర్‌ ఇంకా ప్రారంభం కాలేదు. ట్రయల్‌ పద్ధతిలో ప్రస్తుతం వినియోగదారులు ఇంటర్నెట్ సేవలను ఉచితంగా పొందుతున్నారు. వాణిజ్యపరంగా బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయి? తర్వాత నెలవారీ ఛార్జీలు ఎంత ఉంటాయనే దానిపై...

‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం నివేదిక

రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు దిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి - బామ్రీ మసీదు భూవివాదంలో సామరస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం చేపట్టిన ముగ్గురు సభ్యుల కమిటీ నేడు సర్వోన్నత న్యాయస్థానికి నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం కోసం కోర్టు ఇచ్చిన గడువు జులై 31తో ముగిసింది. దీంతో జస్టిస్‌ ఖలీఫుల్లా నేతృత్వంలోని కమిటీ నేడు నివేదికను సీల్డ్‌ కవర్‌లో సమర్పించింది. దీనిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ జరపనుంది. రోజువారీ విచారణ...

సీఎంల భేటీ.. నదీ జలాల తరలింపుపై చర్చ

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సమావేశం ముగిసింది. గోదావరి జలాల మళ్లింపు, రాష్ట్ర విభజన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన సమాలోచనల్లో ప్రధానంగా గోదావరి జలాల్ని శ్రీశైలానికి తరలించడంపై చర్చ జరిగినట్టు సమాచారం. గత జూన్‌ 28న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా గోదావరి జలాల్ని శ్రీశైలానికి తరలించేందుకు ఇరు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీలు కొన్ని ప్రతిపాదనలు తయారు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇరు...

‘యతి’ నిజంగా ఉన్నాడా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘యతి’. మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరు. ఏకంగా భారత ఆర్మీనే హిమాలయాల్లో ఇవిగో యతి అడుగు జాడలు అంటూ కొన్ని ఫొటోలను ప్రజలతో పంచుకుంది. దీంతో ‘యతి’ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటివరకూ పురాణాలు, ఇతిహాసాల్లో మాత్రమే యతి గురించి విన్నాం. గతంలోనూ ఇలాంటి అనేక వార్తలు వచ్చాయి. దీనిపై భిన్నవాదనలూ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం! యతి అంటే హనుమంతుడా..? భారత పురాణాల ప్రకారం ఈ ప్రపంచంలో చిరంజీవులుగా పేర్కొన్న కొందరిలో ...

అతడో సైకో

బాలికలను కొట్టి అపస్మారక స్థితిలో ఉండగానే అత్యాచారం.. హత్య మహిళను వేధించినందుకు గతంలో దేహశుద్ధి చేసిన గ్రామస్థులు ఆ ఉన్మాదంతోనే ఘాతుకాలు హాజీపూర్‌ హంతకుడు శ్రీనివాస్‌రెడ్డిని పట్టుకున్న రాచకొండ పోలీసులు అమాయకులైన బాలికలకు మాయమాటలు చెప్పాడు. బైక్‌పై ఊర్లో దింపుతానని మభ్యపెట్టాడు.. తన కోరిక తీర్చడానికి వారు అంగీకరించలేదని మానవమృగంలా మారాడు. లైంగిక వాంఛ తీర్చుకున్నాక అమ్మాయిలను చంపేశాడు. జనారణ్యంలో తప్పించుకు తిరుగుతున్న హాజీపూర్‌ మానవమృగం పోలీసులకు...

విలీనం చట్టవిరుద్ధమైతే రద్దు చేస్తాం

ఆ అధికారం హైకోర్టుకు ఉంది అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో స్పష్టం చేసిన హైకోర్టు విచారణ జూన్‌ 11కి వాయిదా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీని ప్రాంతీయ పార్టీ తెరాసలో విలీనం చేయడం చట్టవిరుద్ధమైతే ఆ విలీనాన్ని రద్దు చేస్తామని, ఆ అధికారం తమకుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు విచారించాల్సినంత అత్యవసరమేమీ ఇందులో లేదంటూ విచారణను జూన్‌ 11కి వాయిదా వేసింది. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష...

పార్టీ నేతలతో పవన్‌ సమావేశం

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. తొలి విడత సమీక్షలో భాగంగా  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులతో పవన్ సమావేశమయ్యారు. పోలింగ్ ముగిసిన దాదాపు 10రోజుల తర్వాత పార్టీ తరఫున మొదటి సమావేశం ఇదే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలు,...

వారి నకిలీ పొత్తుకు మే 23తో ఆఖరు:మోదీ

ఇటావా: ఎస్పీ-బీఎస్పీ నకిలీ పొత్తు మే 23తో ముగుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చేశారు. శనివారం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావాలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించడంతో పాటు, విపక్షాలపై విమర్శలు చేశారు.  వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ‘ఎస్పీ, బీఎస్పీ జెండాలు వేరైనా, వాటి ఆలోచనలు మాత్రం ఒక్కటే. వారి హయాంలో రైతులను దోచుకున్నారు. దళితులను వేధించారు. మహిళలకు భద్రత...

శ్రీలంక పేలుళ్లు.. తృటిలో తప్పించుకున్న రాధిక

కొలంబో: శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటన నుంచి సినీ నటి రాధికా శరత్‌కుమార్‌ తృటిలో తప్పించుకున్నారు. రాజధాని కొలంబోలో వరుసగా పేలుళ్లు జరిగాయి. అయితే పని నిమిత్తం శ్రీలంక వెళ్లిన రాధిక ఈరోజు ఉదయం సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బస చేశారు. ఆమె పని ముగించుకుని హోటల్‌ నుంచి బయటికి వెళ్లిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది.  ఈ విషయాన్ని రాధిక ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓ మై గాడ్‌. కొలంబోలోని సిన్నామన్‌ హోటల్‌ నుంచి నేను...

శ్రీలంక పేలుళ్లలో 166 కి చేరిన మృతుల సంఖ్య

కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 166 మంది మృతిచెందినట్లు సమచారం. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈస్టర్‌ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.45 ప్రాంతంలో కొలంబోలోని ఒక చర్చితోపాటు మూడు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బాంబులు పేలాయి. కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌...

శ్రీలంక పేలుళ్లు.. క్షతగాత్రులకు రక్తం కొరత..!

కొలంబో: పేలుళ్ల ఘటనలతో శ్రీలంక రక్తమోడుతోంది. దాదాపు ఆరు చోట్ల జరిగిన పేలుళ్లలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 125 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య వందల్లోకి చేరింది. కొలంబో బయట రెండు పేలుళ్లలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. బట్టికలోవ చర్చిలో ఈస్టర్‌ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన పేలుడులో మృతిచెందిన వారిలో అత్యధికులు చిన్నారులే. ఇక్కడి క్షతగాత్రులను తరలించిన బట్టికలోవ టీచింగ్‌...

కమల్‌, రజనీ కలిసి సాగుతారా..!

శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న అగ్ర నటులు ఎంఎన్‌ఎంతో ప్రజల్లోకి వెళ్లి ఆకట్టుకున్న కమల్‌  పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన రజనీ  రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్న ఇద్దరు మిత్రులు ఈనాడు డిజిటల్‌, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికేందుకు ఇద్దరు అగ్రనటులు పోటీ పడుతున్నారు. విలక్షణ నటనలో ఎవరికి వారే అన్నట్లు పోటీ పడి నటించిన వారు దశాబ్దాలుగా సినీ...

ఏపీ, తెలంగాణలో నేడూ వర్షం

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఆదివారం మధ్యాహ్నంనుంచి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు 1.5 కి.మీ.ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించారు. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వివరించారు. ఉత్తర కర్ణాటక,...

అక్కడ వర్తించని ‘కోడ్’‌..ఏపీకెందుకు?

ఈసీని ప్రశ్నించిన మంత్రి నారా లోకేశ్‌ అమరావతి: ఎన్నికల సంఘం ఆంక్షలన్నీ ఒక్క తెదేపాకే వర్తిస్తాయా అని మంత్రి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి పేరుతో ప్రభుత్వ పరంగా చేసే సమీక్షలపై ఈసీ ఆంక్షలు విధించటంపై ట్విటర్‌లో ఆయన స్పందించారు. ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా అంటూ ప్రశ్నించారు. ‘‘ఎండలు, తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తే ఈసీకి...

తెరాసలోకి త్వరలో మరో ముగ్గురు..!

రెండు, మూడు రోజుల్ల  సీఎంతో భేటీ అయ్యే అవకాశం కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా గల్లంతు చేయాలని తెరాస వ్యూహం ఈనాడు, హైదరాబాద్‌: ఇతర పార్టీలకు చెందిన మరికొందరు శాసనసభ్యులు రెండు, మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. సన్నాహాలు మొదలయ్యాయి. శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు, తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెరాసలో చేరుతామని ప్రకటించారు....

అమృత్‌సర్‌ నుంచి సన్నీ డియోల్‌?

చండీగఢ్‌: బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్‌తో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా భేటీ అయ్యారు. దీంతో సన్నీని అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపే యోచనలో భాజపా ఉన్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. పంజాబ్‌లో శిరోమణి అకాళీదళ్‌తో జట్టు కట్టిన ఆ పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేయనుంది. అందులో ఒకటి అమృత్‌సర్‌. అయితే ఇక్కడి నుంచి ప్రముఖ వ్యక్తిని నిలపాలని గత కొంతకాలంగా భాజపా యత్నిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే హర్భజన్‌ సింగ్‌, పూనమ్‌ ధిల్లాన్‌, రాజేందర్‌ మోహన్‌...

‘ఆ ఆధారాలతో మోదీ జైలుకే’

దిల్లీ: కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కనీస ఆదాయ పథకం ‘న్యాయ్‌’తో దేశ ఆర్థిక వ్యవస్థ  తిరిగి గాడిలో పడుతుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ పథకం ఆర్థిక వ్యవస్థకు ఇంధనంలా పనిచేస్తుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో దీని అమలు కోసం ప్రజలపై పన్ను భారం మోపబోమని హామీ ఇచ్చారు. ‘‘న్యాయ్‌ పథకం గాడి తప్పిన భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. ఇంజిన్‌కి పెట్రోల్‌ శక్తినిచ్చినట్లే న్యాయ్‌తో ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు లభిస్తుంది. దీంతో పేద...

రేణిగుంట రైల్వేస్టేషన్‌లో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం

చిత్తూరు: చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడికి పాల్పడింది. అడ్డుకునేందుకు యత్నించిన టీసీ ఉమామహేశ్వరరావుపైనా నిందితులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీసీ సహా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నిందితులను తమిళనాడుకు చెందిన వెంకటేశ్‌, విజయన్‌గా గుర్తించారు. వారిని రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి గత నేర...

మెట్రోని వణికిస్తున్న గాలివాన!

ఫ్లెక్సీ పడటం, సిగ్నలింగ్‌ లోపాలతో రెండుసార్లు నిల్చిన రైళ్లు ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు సేవలకు తరచూ సాంకేతిక సమస్యలు అవరోధంగా మారుతున్నాయి. తాజాగా 30 గంటల వ్యవధిలో ఏకంగా మూడు చోట్ల మెట్రోరైళ్లు ఆగిపోయాయి. ప్రతిసారి అరగంటకు పైగానే మెట్రో సేవలు నిల్చిపోవడంతో ఆ ప్రభావం కారిడార్‌ మొత్తంపై పడింది. వేలమంది మెట్రోలో ఉన్న వారు, స్టేషన్లలో ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఆలస్యం కారణంగా ఇబ్బంది పడ్డారు. భారీ వర్షం పడి వరదలొచ్చినా.. రహదారులు...

పేద కుటుంబాల్లో పెను విషాదం

మిన్నంటిన నందిమేడారం మృతుల కుటుంబీకుల రోదనలు న్యాయం చేయాని ఠాణా ఎదుట రాస్తారోకో ధర్మారం, న్యూస్‌టుడే: ధర్మారం శివారులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో నందిమేడారానికి చెందిన ఎండీ.షఫీ, కందుకూరి నర్సింహాచారి మృతిచెందిన విషయం విధితమే. ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కాగా తమకు సమాచారం లేకుండానే ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను తరలించారని శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ధర్మారం ఠాణా ఎదుట బాధిత కుటుంబీకులు,...

ధ్యానంతో మానసిక ఒత్తిడి దూరం

వీరన్నపేట (మహబూబ్‌నగర్‌) : గర్భిణుల్లో కలిగే మానసిక ఒత్తిడిని ధ్యానంతో జయించవచ్చని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం చేగూర్‌ కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసిన ఆశా, అంగన్‌వాడీల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆశాలు, అంగన్‌వాడీలు మెరుగైన సేవలు అందించడంవల్లే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటున్నారని అన్నారు. గర్భిణులకు పోషకాహారం, మందులతోపాటు ధ్యానం కూడా ముఖ్యమనే విషయం తెలియజేయాలని కోరారు.  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.రజిని, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ జిల్లా...

యూపీలో పట్టాలు తప్పిన రైలు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. హావ్‌డా నుంచి దిల్లీ వెళ్తున్న పూర్వా ఎక్స్‌ప్రెస్.. కాన్పూర్ సమీపంలో శనివారం వేకువజామున పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పగా.. అందులో నాలుగు పూర్తిగా బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి...

ఆయన్ని సినిమా నుంచి తీసేయడం కుదరదు

ముంబయి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటుడు అలోక్‌నాథ్‌ను సినిమా నుంచి తీసేయడం కుదరదని స్పష్టం చేశారు సినీ నటుడు అజయ్‌ దేవగణ్‌. ఆయన నటించిన ‘దే దే ప్యార్‌ దే’ చిత్రంలో అలోక్‌ కీలక పాత్ర పోషించారు. అయితే అలోక్‌ తనపై అత్యాచారం చేశాడని రచయిత్రి వింటా నందా ఆరోపించిన తర్వాత కూడా ఆయన్ను సినిమాలో తీసుకోవడం ఎంత వరకు సమంజసం? అంటూ పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు అజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అజయ్‌ నిజంగానే ‘మీటూ’కి సపోర్ట్‌...

కార్లు కాదు.. ఉగ్రదాడులకు ఇక బైక్‌లు!

ఇంటర్నెట్‌డెస్క్‌: పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యంపై మరిన్ని తీవ్రమైన దాడులకు పాకిస్థానీ ఉగ్రసంస్థలు సిద్ధమయ్యాయి. కాకపోతే కార్లకు బదులు ఈసారి బైకులను వాడాలని నిర్ణయించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ మోటార్‌ సైకిల్‌ బాంబులతో విడతల వారీగా సాయుధ బలగాలపై దాడులు చేయాలని వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. పుల్వామా దాడి తర్వాత కార్లపై నిఘా పెరిగిపోవడంతో ఉగ్ర సంస్థలు ఈ మార్గాన్ని ఎంచుకొన్నాయి.   ముఖ్యంగా శ్రీనగర్‌, కుప్వారా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవాలని ఉగ్రసంస్థలు ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఇందుకోసం కొందరిని...

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని శాస్త్రిపురంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐసిస్‌ ఉగ్రవాది అబ్దుల్‌ బాసిత్‌ అనుచరులు ఇక్కడ ఉన్నారనే అనుమానంతో ఈ సోదాలు చేపట్టారు. పలువురి ఇళ్లలో శనివారం ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.  2018 ఫిబ్రవరిలో ఉగ్రవాది అబ్దుల్‌ బాసిత్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. అబుదాబిలో ఐసిస్‌ మాడ్యూల్‌ కేసులో అతడిపై ఛార్జిషీటు నమోదైంది. మరికొందరికి ఐసిస్‌తో సంబంధం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది....

ఎన్నికల కమిషన్‌ది ఓవరాక్షన్‌‌: వీహెచ్‌

కాకినాడ కలెక్టరేట్‌: ఎన్నికల కమిషన్‌ ఓవరాక్షన్‌ చేస్తోందని కాంగ్రెస్ సీనియర్‌ నేత వి.హనుమంతురావు అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికల కమిషన్‌ ఏనాడూ ఇంత దారుణంగా వ్యవహరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ను అకారణంగా తొలగించారని, ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిచడం లేదని ఆరోపించారు. ప్రధాని మోదీని వ్యతిరేకించే వారిపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో అంబేడ్కర్‌...

ఓటు హక్కు వినియోగించుకున్న తలైవా

దిల్లీ : సార్వత్రిక సమరంలో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. దేశంలోని పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కూడా ఓటేశారు. ఆయన కూమారుడు కార్తీ చిదంబంరం తమిళనాడులోని శివగంగ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరో అజిత్‌, నటుడు అరుణ్‌ విజయ్‌ కూడా తమ ...

మా నాన్నను వదలొద్దు!

తండ్రి ఘాతుకానికి వణికిన బాలిక తమ్ముడు, చెల్లెలి హత్యతో ఆందోళన పటాన్‌చెరు అర్బన్‌, పటాన్‌చెరు: ‘తమ్ముడ్ని చాకుతో గొంతుపై కోశాడు. చెల్లిని తీసుకెళ్లి వంట గదిలో ఉరిపోశాడు. నన్ను కూడా చంపేద్దామని చాకుతో కోయబోయాడు. అలికిడి అవ్వగానే మేల్కొని భయంతో ఆయనకు దూరంగా జరిగా. నన్ను చంపొద్దని, నీ కాళ్లు మొక్కుతానంటూ కాళ్లావేళ్లా మొక్కా. అయినా దయతలచకుండా గొంతుపట్టి చాకుతో కోయబోయాడు. అయితే తాగిన మత్తులో ఉండి తూలిపడటంతో నాకు స్వల్పగాయమైనా సరే తప్పించుకుని...

బీమా సొమ్ము కోసం టీచరు ఘాతుకం

తోడల్లుడి దారుణ హత్య ముందే జీవిత పాలసీలు కట్టి ఆపై కిరాతకం పాల్వంచ పట్టణం: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వోపాధ్యాయుడే అక్రమార్జన కోసం కుట్రపూరితంగా వ్యవహరించి భార్యతో కలిసి సమీప బంధువునే హత్య చేసిన ఉదంతమిది. బీమా సొమ్ము కోసం ఎంతో నమ్మకంగా వ్యవహరించి స్వయానా తోడల్లుడినే అంతమొందించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్‌ రాజువాల్‌, రాధా భార్యభర్తలు. రాజువాల్‌ అశ్వాపురం మండలం వెంకటాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు....

‘పరిషత్‌’ పోరు.. నేడో, రేపో నోటిఫికేషన్‌!

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయగా.. ఎన్నికల సంఘం సైతం ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసింది. తాజాగా గురువారం అన్ని జిల్లాలకు చెందిన కలెక్టర్లు, పోలీసు, పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎస్‌ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు...

పోలింగ్‌ వేళ.. బెంగాల్‌లో ఉద్రిక్తత

రాయ్‌గంజ్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్‌గంజ్‌ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్‌ జిల్లాలో కొందరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.  దినాజ్‌పూర్‌ జిల్లాలోని ఇస్లాంపూర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చోప్రాలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన తమను ఓటు వేయకుండా అడ్డుకున్నారని, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు పోలింగ్‌ బూత్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారని స్థానికులు ఆరోపించారు....

ఎవరిని నమ్మాలి.. మోదీనా.. బ్యాంకులనా?

విజయ్‌ మాల్యా  దిల్లీ: తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తానన్న బ్యాంకులు తీసుకోవడం లేదంటూ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విజయ్‌ మాల్యా తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ సారి ఏకంగా ప్రధాని మోదీపైనే ఆరోపణలు చేశారు. తాను చెల్లించే బకాయిల విషయంలో ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారా లేదా బ్యాంకులు చెబుతున్నాయా అర్థం కావడం లేదని విమర్శించారు. ‘బ్యాంకులకు నేను(మాల్యా) చెల్లించాల్సిన రుణాల కంటే ఎక్కువగానే ప్రభుత్వం...

వారణాసి.. ప్రియాంక.. ఓ సస్పెన్స్‌

ఇప్పుడే చెప్పనంటున్న రాహుల్‌ లఖ్‌నవూ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(యూపీ తూర్పు విభాగం)గా బాధ్యతలు చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ప్రియాంక గాంధీ వాద్రా. ఆమె రాక సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్‌ నేతలు విశ్వాసంగా ఉన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేస్తారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై స్పష్టత మాత్రం రావట్లేదు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడప్పుడే చెప్పనంటూ...

స్టార్‌డమ్‌ని నమ్ముతా కానీ… దానికి అర్థం అది కాదు

‘‘ఇంట్లో నాకు నవీన్‌ అని పేరు పెట్టారు. మా అమ్మ ముద్దుగా నాని అని పిలుచుకుంది. ప్రేక్షకులు నాకు ఇష్టంతో పెట్టిన పేరు... నేచురల్‌ స్టార్‌. మొదట్లో ఎందుకు అనుకొనేవాణ్ని కానీ... వాళ్లు ప్రేమతో అలా పిలుస్తున్నప్పుడు ఎంతో  సంతృప్తిగా ఉంటుంద’’న్నారు నాని. సహజమైన నటనతో పాత్రల్లో  ఒదిగిపోతున్న కథానాయకుడాయన. ఇటీవల క్రికెట్‌ నేపథ్యంలో ‘జెర్సీ’ చేశారు. ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల  ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాని బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ... ఇది...

రేపు సాయంత్రమే ఇంటర్‌ ఫలితాలు

హైదరాబాద్‌ :  తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. సాయంత్రం 5గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను  ప్రకటించనున్నట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌ రెడ్డి విడుదల చేస్తారని తెలిపారు. ఫిబ్రవరి 27నుంచి మార్చి 16వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు సుమారు 9లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను https://www.eenadu.net, http://eenadupratibha.netలలో తెలుసుకోవచ్చు.

వైకాపాకు ప్రతిపక్ష హోదా కష్టమే: దేవినేని

అమరావతి: జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఎన్నికల ఫలితాలు చూసి తట్టుకునేందుకు జగన్‌ సిద్ధంగా లేరని, ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిషోర్ జగన్ చేతిలో సీఎం అనే నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లాడని విమర్శించారు. 11వ తేదీ సాయంత్రమే జగన్ తన ఓటమిని అంగీకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ వరకు క్యాడర్‌ని కాపాడుకునేందుకు జగన్ అనేక తంటాలు పడుతున్నారని ఉమా అన్నారు. స్పీకర్‌పై దాడి చేసింది కాక గవర్నర్‌కు...

ఎన్నికల తాయిలాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

దిల్లీ: గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇష్టారీతిన ప్రజలకు హామీలు ఇస్తుంటాయి. వీటిలో భాగంగా ప్రజలకు నగదు పథకాలు, రుణమాఫీలాంటివి ప్రకటిస్తుంటారు. ఇలాంటి భారీ హామీ పథకాలపై పలువురు ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు కూడా. తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటించే హామీలపై పార్టీలకు సూచనలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల సందర్భంగా  ప్రజలకు రుణమాఫీ, నగదు పథకాలు వంటివి ప్రకటించకుండా పార్టీలకు...

‘నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనేవారు’

నల్లగా ఉన్నానని ఎగతాళి చేశారు: సోనమ్‌ కపూర్‌ ముంబయి: ‘నల్లగా, పొడుగ్గా ఉన్నానని ఒకప్పుడు చాలా మంది ఎగతాళి చేసేవారు’ అంటూ గతంలో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి ఓ కార్యక్రమంలో పంచుకున్నారు బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘పించ్‌’ అనే కార్యక్రమంలో సోనమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్‌ అనుభవాల గురించి మాట్లాడారు. ‘ఒకప్పుడు నేను పొడుగ్గా, సన్నగా,...

అగ్రరాజ్యానికి పక్కలో బల్లెం

‘మనకు తెలుస్తోందో లేదో కాని, ఇప్పుడు మనమో సమస్యలో చిక్కుకుంటున్నాం. ఒక్కసారి వాళ్లు వెనుజువెలాలో పాదం మోపారంటే క్రమంగా మన దగ్గరికే వస్తారు. మన దక్షిణ భూభాగం వారి లక్ష్యం పరిధిలోకి వస్తుంది. సరైన ఆయుధాలు ఉంటే తేలిగ్గా ఫ్లోరిడా లేదా ఇతర కీలక భూభాగాలపై దాడి చేయవచ్చు’... ఈ మాటలు అన్నది ఎవరో కాదు- అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ రిక్‌ స్కాట్‌. ఏదైనా తెగేదాకా లాగే వైఖరి ఉన్న అధ్యక్షుడు ట్రంప్‌ వైఖరిని ఈ...

‘అప్పుడు చంద్రబాబు గెలిచింది ఇదే ఈవీఎంలతో’

వైకాపా అధినేత జగన్‌ హైదరాబాద్‌ : వైకాపా అధినేత జగన్‌ గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. ఏపీలో పరిపాలన, శాంతిభద్రతల వైఫల్యంపై జగన్‌ గవర్నర్‌కు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంపీలతో కూడిన తమ పార్టీ బృందం దిల్లీలో సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసిందని.. మళ్లీ అవే అంశాలను ఇక్కడ గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చినట్లు వివరించారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన దాడి ఘటనలను గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు....

అసోంలో తెలుగు చైతన్య కీర్తి

అసోంలోని కరీమ్‌గంజ్‌ లోక్‌సభ స్థానం ఈనెల 18వ తేదీన ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నియోజకవర్గంలోని హైలకండీ గువాహటికి 310 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి అధికారులు ప్రత్యేకంగా మహిళా ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఈ ప్రాంతంలో ముస్లింలు, వలస వచ్చిన బెంగాలీలూ ఎక్కువ. సంప్రదాయాల పేరుతో మహిళలు బయటకురారు. దాంతో హైలకండీలో మహిళల పోలింగ్‌ శాతం తక్కువ నమోదవుతున్నట్టు ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ జల్లి కీర్తి గుర్తించారు. 2013లో సివిల్స్‌కు ఎంపికైన తెలుగమ్మాయి కీర్తి అక్కడ...

ఐదేళ్లలో అంతర్జాతీయ శక్తిగా అవతరించాం: అమిత్‌షా

దిల్లీ: మోదీ నేతృత్వంలో ఈ ఐదేళ్లలో అంతర్జాతీయ శక్తిగా భారత్‌ అవతరించిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి.. అద్భుతమైన పాలన అందించామని చెప్పారు. భాజపా మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం అభివృద్ధిలో దూసుకెళుతోందన్నారు. రూ.12 లక్షల కోట్ల స్కామ్‌లను వెలుగులోకి తెచ్చామని చెప్పారు. సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నామని, అసాధ్యాలను సుసాధ్యం చేశామని వివరించారు. కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. సర్జికల్‌ స్ట్రైక్‌ ద్వారా...

యోగి‌, మాయావతిపై ఈసీ కొరడా

దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతిపై ఈసీ కొరడా ఝళిపించింది. ఎన్నికల వేళ ఇరువురు నేతల ప్రచారంపై పలు ఆంక్షలు విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7న యోగి ఆదిత్యనాథ్‌, మాయావతి చేసిన మతపరమైన వ్యాఖ్యలపై ఈసీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అ అంశాన్ని...

గోరఖ్‌పూర్‌ బరిలో రేసు గుర్రం నటుడు

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో భాజపా కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌ నుంచి ప్రముఖ నటుడు రవి కిషన్‌ను బరిలోకి దించింది కమలం పార్టీ. యూపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఏడుగురు అభ్యర్థుల జాబితాను భాజపా సోమవారం విడుదల చేసింది. ఇందులో గోరఖ్‌పూర్‌ స్థానానికి రవి కిషన్‌ పేరుకు ప్రకటించింది.  ఇక ఇటీవలే భాజపాలో చేరిన గోరఖ్‌పూర్‌ సిట్టింగ్‌ ఎంపీ ప్రవీణ్‌ కుమార్‌ నిషాద్‌ను సంత్‌ కబీర్‌ నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపారు. గోరఖ్‌పూర్‌...

‘అక్కడ ఎన్నికల రద్దుకు ఆదేశించలేదు’

వెల్లూరు: తమిళనాడులోని వెల్లూరులో భారీగా నగదు పట్టుబడడంతో అక్కడ ఎన్నికలు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈసీ, ఐటీ తనిఖీల్లో స్థానిక డీఎంకే పార్టీ కార్యాలయంలో భారీగా నగదు పట్టుబడ్డట్లు సమాచారం. దాదాపు రూ.11కోట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.  దీంతో ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం...

కర్ణాటకలో ఐటీ సోదాలు

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. బెంగళూరు, హసన్‌, మండ్య ప్రాంతాల్లోని దాదాపు 12 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రియల్‌ఎస్టేట్‌, క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్రోల్‌ బంక్‌లు నిర్వహించేవారు, కోఆపరేటివ్‌ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్లు తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. వీరి వద్ద అప్రకటిత ఆస్తులు ఉన్నాయని,...

అంగ రంగ వైభవంగా సీత రామ కల్యాణ మహోత్సవం

దమ్మాయిగూడ: ఎం ఎల్ ఆర్ కాలనీ నందు సీత రామ కల్యాణ మహోత్సవం అంగ రంగ వైభవంగా జరిగింది. దమ్మాయిగూడ సర్పంచ్ అనురాధ గారు యాదగిరి గౌడ్ గారు, కార్తిక్ గౌడ్ గారు మరియు టి .ఆర్ . స్ కార్యకర్తలు పాల్గొన్నారు. అసోసియేషన్ మెంబెర్స్ ప్రెసిడెంట్ PSC. బోస్ గారు, వైస్ ప్రెసిడెంట్స్ RK. మల్లికార్జున,...

‘అప్పుడే నేమ్‌ ప్లేటా?.. అది పిచ్చికి పరాకాష్ట’

అమరావతి: ఈవీఎంలపై చర్చ తప్పించుకునేందుకు ఈసీ కుంటి సాకులు వెతుకుతోందని మంత్రి దేవినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. 31 కేసులున్న జగన్, 13 కేసులున్న విజయ్ సాయిరెడ్డి ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేసు ఉందనే కారణంతో వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ను చర్చకు వద్దంటున్నారని, ఈవీఎంలు ఏ విధంగా హ్యాక్ చేయొచ్చో చూపి అందరినీ అప్రమత్తం చేసినందుకే ఆయనపై కేసు పెట్టారని తెలిపారు. పీకే బృందం చివరి పేమెంట్ కోసం జగన్‌ని భ్రమల్లో ఉంచుతోందని, జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం...

జగిత్యాల: నడిరోడ్డుపై గొడ్డలితో దాడి..

జగిత్యాల గ్రామీణం: జగిత్యాల జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణానికి చెందిన తిప్పర్తి కిషన్‌, అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ మధ్య భూవివాదం విషయంలో తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం జగిత్యాల టవర్‌ సర్కిల్‌ సమీపంలోని సార్గమ్మ వీధిలో ఉంటున్న కిషన్‌ వద్దకు చేరుకున్న లక్ష్మణ్‌.. ద్విచక్ర వాహనంలో ఉంచిన గొడ్డలిని బయటకుతీసి విచక్షణారహితంగా దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే...

50 శాతం లెక్కించడానికి అభ్యంతరమేంటి?

దేశంలో అసలు ఎన్నికల సంఘం ఉందా? వీవీప్యాట్‌లపై ఈసీని నిలదీసిన చంద్రబాబు అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని చెబుతుంటే మీకున్న అభ్యంతరమేంటని ఈసీని చంద్రబాబు నిలదీశారు. ఈవీఎంలలో నమోదువుతున్న ఓట్లకు వీవీప్యాట్‌కు స్లిప్పులకు తేడా ఉంటున్నందునే లెక్కించాలని చెబుతున్నామన్నారు. 50 శాతం స్లిప్పులు లెక్కించడానికి మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ఈసీని ప్రశ్నించారు. ఈ మేరకు అమరావతిలో మీడియాతో ఆయన  మాట్లాడారు. వీవీ ప్యాట్లపై ఇక్కడితో ఆగేది లేదని.. ఇతర రాష్ట్రాలకూ వెళ్లి అందరినీ...

ఈవీఎం.. రేకెత్తిస్తోంది భయం

ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఈవీఎంలను 1980లో ఎంబీ హనీఫా కనిపెట్టారు. తొలిసారి 1982లో కేరళలోని ఉత్తర పరవూర్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ఇవి విజయవంతం కావడంతో 1989లో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, ఈసీఐఎల్‌ల సహకారంతో ఈవీఎంలను ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో తయారు చేయించింది. తర్వాత 1998 నవంబరులో 16 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలలో వాడారు. రాష్ట్రం అంతటా మొత్తం వీటినే వినియోగించడమనేది 1999 గోవా అసెంబ్లీ ఎన్నికలతో మొదలయింది. 2003లో...

భీష్ముడిలా మౌనం వహిస్తారేం?

ములాయం సింగ్‌ను ఉద్దేశిస్తూ సుష్మా స్వరాజ్ ట్వీట్‌ రాంపూర్‌: లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్‌ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, సినీ నటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అజాంఖాన్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ ఖండించారు. దీనిపై ఎస్పీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ స్పందించకపోవడాన్నీ ఆమె తప్పుబట్టారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిపై అభ్యంతరం తెలపకపోగా కనీసం స్పందించే ప్రయత్నం కూడా చేయడం లేదంటూ ఆమె ట్విటర్ వేదికగా...

కాంగ్రెస్‌ ఓటమిని అంగీకరించినట్లే: స్మృతి ఇరానీ

అమేఠీ (ఉత్తర్‌ప్రదేశ్‌): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కేంద్రమంత్రి, భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లుంటే వాటిలో దాదాపు 20 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తోంది. తాము పోటీ చేసేందుకు రాష్ట్రంలో బలం లేదని, గెలిచే సత్తా లేదని ఆ పార్టీ నేతలు అంగీకరించినట్లు దీన్నిబట్టే తెలుస్తోంది. ఇక ప్రజలు ఆ పార్టీ వైపున ఎందుకు ఉండాలి. రండి.. ముందుకు వచ్చి భాజపాకు ఓటు వేయండి....

రాహుల్‌ను అధికారంలోకి రానివ్వం:ఉద్దవ్‌ ఠాక్రే

నాగ్‌పూర్‌: ఎన్నికల వేళ ఎన్డీయే భాగస్వామ్య పక్షం శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ హామీని ఆయన తప్పుబట్టారు. దేశద్రోహులకు మద్దతునిస్తున్న రాహుల్‌ను అధికారంలోని రానిచ్చేది లేదని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఆదివారం జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజయోజనాల దృష్ట్యా భాజపా, శివసేన, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఏకతాటిపైకి వచ్చాయన్నారు. మరి ప్రతిపక్షాలు ఎందుకు కలిసి పోటీ చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు...

డంపింగ్ యార్డ్ గురించి సానుకూల నిర్ణయం

దమ్మాయిగూడ :TSPCB వారి ఆధ్వర్యంలో, GHMC మరియు RAMKY వారితో పాటు దమ్మాయిగూడ JAC వారితో గంటన్నర సేపు చర్చలు జరిగాయి. ఈ చర్చలలో బాగంగా, డంపింగ్ యార్డ్ ఎత్తి వేయాలని JAC వారు GHMC మరియు RAMKY వారి ముందు గట్టిగా ఆందోళన వ్యక్తం చేసారు, అందుకు GHMC వారు మరియు TSPCB వారు సానుకూలంగా స్పందించి అతిత్వరలో ఈ సమస్య పరిష్కరిస్తామని, రాబోయే 3 నెలలో 25 శాతం లక్డారం ఏరియా...

ఇదేంటి బాస్‌!

కరెంటు బిల్లే రూ.25 వేలుఅన్ని శాఖలకు పెద్దన్నలాంటి ఒక శాఖ ఉన్నతాధికారికి నెలకు 25 వేలు కరెంటు బిల్లు వస్తోంది. ఆ అధికారి పగలంతా సచివాలయంలో ఉంటారు కానీ, ఆయన ఇల్లు కమర్షియల్‌ జోన్‌లో ఉంది. అందుకే ఇంత బిల్లు. ఈ బిల్లును ప్రజాధనం నుంచే చెల్లిస్తున్నారు. ఇంటి నిర్వహణ, వంట సరుకులు, కూరగాయలకు అవసరమయ్యే డబ్బులు కూడా రోజువారీగా లేదా అవసరాన్ని బట్టి రెండు మూడు రోజులకొకసారి నగదు రూపంలో తీసుకుంటున్నారు. ఇంట్లో పనివాళ్లకిచ్చే వేతనాలు కూడా ప్రజాధనం...

‘సంతృప్తి’గా సడలింపు

పథకాల అర్హతల్లో మార్పులుసొంత కారు ఉన్నా ఆరోగ్యశ్రీతెల్లరేషన్‌కార్డు లింకు తీసివేతట్యాక్సీ, ఆటోవాలాలకీ బియ్యంజగన్‌ విద్యాపథకాలకు ఆదాయపరిమితి 2.50 లక్షలకు పెంపుపథకానికొక కార్డు కొత్తగా జారీ అమరావతి, నవంబరు 15 : సంక్షేమ పథకాలను సంతృప్తస్థాయిలో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం వివిధ పథకాల అర్హతలను సడలించనుంది. బియ్యంకార్డు, ఆరోగ్యశ్రీ, పెన్షన్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లబ్ధిదారులకు వేర్వేరుగా కార్డులు జారీచేయనుంది. డిసెంబర్‌ 20 లోగా లబ్ధిదారుల జాబితాలను విడుదల చేయనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి...

భూ వివాదాల్లో తలదూర్చొద్దు

సమస్యలు కొనితెచ్చుకోవద్దుమీ కుటుంబ సభ్యులుంటే పరిష్కరించుకోండి.. లేకపోతే మీకే నష్టంరియల్‌ ఎస్టేట్‌ వివాదాల్లో జోక్యం వద్దు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దురెవెన్యూకు దూరంగా ఉండండి.. భూ వివాద విజ్ఞప్తులు తీసుకోవద్దుప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఆదేశం హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘ఒక్కో భూమిని నలుగురైదుగురు క్లెయిమ్‌ చేస్తున్నారు. ఏదో ఒక పక్షం వైపు ఉండి వివాదాలు కొని తెచ్చుకోవద్దు. భూముల వివాదాలకు దూరంగా ఉండండి’’ అని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ సభ్యులు...

సమస్యల పరిష్కారానికే శత్రుత్వం

చేతులు కట్టుకుని కూర్చుంటేతలపైకి ఎక్కి తైతక్కలాడతారు50 మందిని పొట్టనపెట్టుకునిఇసుక వారోత్సవాలా?.. సిగ్గుచేటు!కార్మికుల కోసం ఆహార శిబిరాలు ఏర్పాటుమంగళగిరిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళగిరి, నవంబరు 15: ‘‘నాకు ఎవరి మీదా వ్యక్తిగత ద్వేషం లేదు. శత్రువులు లేరు. కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం శత్రుత్వం పెట్టుకుంటాను. అలాంటి వారిని ప్రత్యర్థులుగా భావిస్తాను. ప్రజాస్వామ్యంలో మనకెందుకులే అని చేతులు కట్టుకొని కూర్చుంటే ఒక్కొక్కరూ తలపైకి ఎక్కి తైతక్కలాడుతారు. అలా తైతక్కలాడే వారిని తల మీద నుంచి...

గీత దాటొద్దు!

పార్లమెంటులో మన స్వరం వినిపించాలిఎంపీలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘అందరూ పార్టీ గీతలోనే నడవాలి. కొందరు ఎంపీలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను టీవీ చర్చల్లో చెప్పేస్తున్నారు. ఒకరిద్దరు ఎంపీలు పార్టీని సంప్రదించకుండానే నేరుగా కేంద్ర మంత్రులు, ప్రధానిని కలుస్తున్నారు. ఇది సరికాదు’’ అని పార్టీ ఎంపీలకు వైసీపీ అధినేత, సీఎం జగన్‌ సూచించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిందుకు వీలుగా తాడేపల్లిలోని నివాసంలో శుక్రవారం వైసీపీ ఎంపీలతో...

కక్ష సాధింపుతో తనను బదిలీ చేశారని ఆ సబ్ ఇన్‌స్పెక్టర్ ఏం చేశారంటే?

ఇటావా: ఉత్తరప్రదేశ్‌లో విజయ్ ప్రతాప్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్‌ను పై అధికారి బదిలీ చేశారు. పోలీస్ లైన్ పోలీస్ స్టేషన్‌ నుంచి బిథోలీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇది ఇష్టం లేని విజయ్ ప్రతాప్ పరుగు తీయడం ప్రారంభించాడు. తనను బదిలీ చేసిన పోలీస్ స్టేషన్ వరకూ పరిగెడుతూనే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పరిగెత్తి పరిగెత్తి ఒక చోట రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయాడు. పోలీస్ రిజర్వ్ ఇ‌న్‌స్పెక్టర్ నిరంకుశ, కక్ష సాధింపు విధానాలకు నిరసనగానే తాను పరుగు తీశానని విజయ్...

భవిష్యత్‌పై ఆశలను చంపేశారు

భూముల అమ్మకం తుగ్లక్‌ చర్యసంపద చక్రాన్ని రివర్స్‌ చేశారుఅశాంతిని సృష్టించడమే వైసీపీ పాలసీటీడీపీ నేతల భేటీలో చంద్రబాబు ఫైర్‌ అమరావతి, నవంబరు 15: ‘‘ప్రజల్లో భవిష్యత్‌పై ఆశను చంపేశారు. ఏ రంగంలో చూసినా ముగింపు కనబడుతోంది. అవకాశం ఉంటేనే అభివృద్ధి సాధ్యం. పెట్టుబడులు రాకుండా అంతా ధ్వంసం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇలా చేయడం ఎవరైనా చూశామా? ఎప్పుడైనా జరిగిందా? ప్రభుత్వ భూముల అమ్మకం ఇంకో తుగ్గక్‌ చర్య. భూముల ధరలు పడిపోయేలా చేశారు. సీఎం...

పవన్‌.. సీజనల్‌ దోమలాంటోడు

ట్విటర్‌లో విజయసాయి విమర్శలు అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సీజన్‌లో వచ్చిపోయే దోమలాంటోడని వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. పవన్‌తోపాటు టీడీపీ అధినేత చంద్రబాబుపై శుక్రవారం ఆయన ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘నిత్య కల్యాణం’ పవన్‌ గురించి సోషల్‌ మీడియాలో ఏమనుకుంటున్నారంటే.. సీజన్‌లో వచ్చే డెంగీ, చికున్‌ గున్యా వ్యాప్తి చేసే దోమలాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనబడకుండా పోతాడట. ఇన్నాళ్లూ నడిచిందేమోకాని ఇకపై ‘దోమ’లకు...

టీడీపీ అంటే తడుపుకొంటున్నారెందుకు?

ట్విటర్‌లో విజయసాయికి బుద్దా ప్రశ్నలు విజయవాడ, నవంబరు 15: తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శుక్రవారం ట్విటర్‌ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘‘దేవుడి స్ర్కిప్ట్‌ ఏమయ్యింది విజయసాయిరెడ్డి గారు? 23 మందే గెలిచారని ఎద్దేవా చేసిన మీ జగన్‌ గారు ఇప్పుడు ఎందుకు తడుపుకొంటున్నారు? టీడీపీ పేరు వింటే వణుకు పుడుతుందా? చంద్రబాబుగారిని చూసి నిద్రపట్టడం లేదా? నీతులు వల్లించిన జగన్‌ గారు సిగ్గు లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా ఎలా...